![Sam Altman: వచ్చే వారం భారత్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్! Sam Altman: వచ్చే వారం భారత్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్!](https://i.cdn.newsbytesapp.com/te/images/l62420250130101738.jpeg)
Sam Altman: వచ్చే వారం భారత్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్!
ఈ వార్తాకథనం ఏంటి
చాట్‌జీపీటీ (ChatGPT) మాతృసంస్థ అయిన ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) త్వరలో భారత్ పర్యటన చేపట్టనున్నారు.
వచ్చే వారంలో ఆయన భారతదేశంలో పర్యటించి అక్కడి ప్రభుత్వాధికారులతో సమావేశమవుతారని సమాచారం.
ఈ సమయంలో, ఓపెన్ ఏఐ భారత్‌లో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది.
మరోవైపు, చైనా ఏఐ డీప్‌సీక్ రాకతో ఈ రంగంలో గట్టి పోటీ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో, ఆల్ట్‌మన్ పర్యటన ముఖ్యమైనదిగా మారింది.
ఫిబ్రవరి 5న దిల్లీకి ఆయన రానున్నట్లు, అయితే షెడ్యూల్‌లో మార్పులు ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.
కానీ, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
వివరాలు
భారత్ ఓపెన్ ఏఐకు అతిపెద్ద మార్కెట్
ఆల్ట్‌మన్ చివరిసారిగా 2023లో, ఆల్ట్‌మన్ భారత్‌ను సందర్శించి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో,కృత్రిమ మేధన సాంకేతికతతో ఓపెన్ ఏఐ తీసుకువచ్చిన చాట్‌బాట్ పట్ల ఆవిష్కరణలు జరిపారు.
అమెరికా తరువాత భారత్‌లో చాట్‌బాట్‌ను వినియోగించే వారిలో రెండో స్థానంలో ఉందని ఆయన చెప్పారు.
భారత్ ఓపెన్ ఏఐకు అతిపెద్ద మార్కెట్‌గా పేర్కొన్నారు. మరోవైపు, ఓపెన్ ఏఐ భారత్‌లో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది.
కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి దేశీయ వార్తా సంస్థ అయిన ఏఎన్‌ఐ గత సంవత్సరంలో దావా వేసింది.
ఈ కేసులో పలువురు మీడియా సంస్థలు కూడా జతచేసాయి.దీనిపై, ఓపెన్ ఏఐ స్పందిస్తూ, తమది కేవలం బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగించే విధానం అని స్పష్టం చేసింది.