LOADING...
Japan: జపాన్‌ ప్రైవేటు కంపెనీ 'ఐస్పేస్‌' ప్రయోగించిన మూన్‌ మిషన్‌ విఫలం 
జపాన్‌ ప్రైవేటు కంపెనీ 'ఐస్పేస్‌' ప్రయోగించిన మూన్‌ మిషన్‌ విఫలం

Japan: జపాన్‌ ప్రైవేటు కంపెనీ 'ఐస్పేస్‌' ప్రయోగించిన మూన్‌ మిషన్‌ విఫలం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

జాబిల్లి (చంద్రుడు)పై తొలిసారి అడుగుపెట్టాలని కలను సాకారం చేసుకునేందుకు, జపాన్‌ (Japan) ఇటీవల కీలక ప్రయోగంచేపట్టింది.. కానీ అది విఫలమైంది. జపాన్‌లోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 'ఐస్పేస్' చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ జరగాలని 'మూన్ మిషన్‌'ను ప్రయోగించింది. అయితే, చంద్రుడిపై ల్యాండ్ అవుతున్న సమయంలో 'రెసిలెన్స్' ల్యాండర్‌తో సంబంధాలు నిలిపిపోయినట్లు ఐస్పేస్ ధ్రువీకరించింది. 2025 జూన్ 6 ఉదయం 8:00 గంటల సమయంలో మిషన్ కంట్రోలర్లు ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఆగిపోయినట్లు తెలిపారు. సంబంధాలను తిరిగి సాధించడం అసంభవం అని భావించి, ఈ మిషన్‌ను ముగించామని వెల్లడించారు. ఈ విఫలం వెనుక కారణాలను కనుగొనే ప్రయత్నం జరుగుతోందని ఐస్పేస్ వ్యవస్థాపకుడు తకేషి హకమడ తెలిపారు.

వివరాలు 

'SLIM' అనే అంతరిక్ష నౌకను చంద్రుడిపై ల్యాండ్ చేసిన జపాన్ 

జపాన్ ప్రయోగించిన అంతరిక్ష నౌక మే నెలలో చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. 'మేర్ ఫ్రిగోరిస్' అనే ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ మిషన్, 'రెసిలెన్స్' ల్యాండర్ కక్ష్య నుండి గమ్యస్థానానికి వెళ్తున్న సమయంలో మిషన్ కంట్రోలర్లతో కమ్యూనికేషన్ కోల్పోయింది. భారత్,అమెరికా,రష్యా వంటి దేశాలు చంద్రునిపై తమ మిషన్ల ద్వారా గణనీయమైన పురోగతి సాధించాయి. ఇప్పటివరకు కేవలం నాలుగు దేశాలు.. అమెరికా, రష్యా, చైనా, భారత్ .. మాత్రమే చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టాయి. తాజాగా జపాన్ కూడా చంద్రుడిపై కాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటివరకు జపాన్ ఒక్కసారి మాత్రమే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ నిర్వహించగలిగింది. గత సంవత్సరం జపాన్ 'SLIM' అనే అంతరిక్ష నౌకను చంద్రుడిపై ల్యాండ్ చేసింది.

వివరాలు 

రెసిలెన్స్' జపాన్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ ఐస్పేస్ రెండో ల్యాండర్

'రెసిలెన్స్' జపాన్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ ఐస్పేస్ రెండో ల్యాండర్. ఐస్పేస్ తొలి ల్యాండర్ 2023లో చంద్రుని కక్ష్యలోకి వెళ్లింది, కానీ సేఫ్ ల్యాండింగ్ చేయలేకపోయింది. తాజాగా ఐస్పేస్ రెండవ ల్యాండర్ 'రెసిలెన్స్' చంద్రుని ఉత్తర భాగంలో ఉన్న చదునైన 'మేర్ ఫ్రిగోరిస్' ప్రాంతంలో దిగేందుకు ప్రయత్నించింది, కాని అది విఫలమైంది.