ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22
సామ్ సంగ్ Galaxy S22 ఫోన్ ధర తగ్గింపు ధరతో అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. కొత్త మోడల్ Galaxy S23 విడుదల తో, సామ్ సంగ్ Galaxy S22 ధరను గణనీయంగా తగ్గించింది ఆ సంస్థ. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరకు Galaxy S22 రావడమే కాదు Galaxy S23కు పెద్దగా తేడా కూడా లేకపోవడంతో ఈ ఫోన్ కొనుక్కోవడానికి ఇదే మంచి సమయం. Galaxy S22 8GB/128GB మోడల్ ధర రూ. 72,999 ఉండేది ఇప్పుడు బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 57,999కే లభిస్తుంది.
కస్టమర్‌లు 12 నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు
కొనుగోలుదారులు ప్రస్తుత ఫోన్‌కు బదులుగా రూ. 31,000 తగ్గింపు తో రూ. 26,999కే పొందచ్చు. కస్టమర్‌లు 12 నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. Galaxy S22 Snapdragon 8 Gen 1 చిప్ తో పాటు, LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది 8GB/128GB, 8GB/256GB కాన్ఫిగరేషన్ లో అందుబాటులో ఉంది.ఇది 25W వైర్డ్, 15W Qi-సపోర్టెడ్ వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 3,700mAh బ్యాటరీతో వస్తుంది. 5G, డ్యూయల్-సిమ్‌లు, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC, టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ తో వస్తుంది.