DeepSeek: డీప్‌సీక్ సెన్సిటివ్ డేటా వెబ్‌కు బహిర్గతం: ఇజ్రాయెల్ సైబర్ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ (Deepseek) దూకుడు కొనసాగిస్తోంది.
ఆర్1 మోడల్‌ను విడుదల చేసిన అనంతరం ఇది మొత్తం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
ఈ నేపథ్యంలో, ఆ సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ విజ్ గుర్తించింది.
డీప్‌సీక్ చాలా సున్నితమైన డేటాను ఓపెన్ ఇంటర్నెట్‌కు విడుదల చేస్తున్నట్లు విజ్ తెలిపింది.
వివరాలు
డిజిటల్ సాఫ్ట్‌వేర్ కీలు, యూజర్ల చాట్ లాగ్స్
"దాదాపు ఒక మిలియన్ లైన్ల డేటా, డీప్‌సీక్ సురక్షితంగా నిల్వ చేయకపోవడం వల్ల ఆ డేటా బయటకు వచ్చింది. ఇందులో డిజిటల్ సాఫ్ట్‌వేర్ కీలు, యూజర్ల చాట్ లాగ్స్ కూడా ఉన్నాయి. చాలా సున్నితమైన డేటా ఓపెన్ ఇంటర్నెట్‌కు చేరిందని మేము గుర్తించాము," అని విజ్ బుధవారం తన బ్లాగ్‌లో పేర్కొంది.
ఈ విషయంపై తమ సంస్థ వారు అప్రమత్తం చేసిన గంటలోనే, డీప్‌సీక్ డేటాను భద్రపరిచిందని విజ్ సహ వ్యవస్థాపకుడు అమీ లుత్వాక్ తెలిపారు.
అదనంగా, ఇది కనుగొనడం చాలా సులభమని చెప్పారు. అయితే, డీప్‌సీక్ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు.
వివరాలు
51 దేశాలలో డీప్‌సీక్ ప్లే స్టోర్‌లో అగ్రస్థానంలో..
చైనాలోని హాంగ్జౌకు చెందిన ఈ ఏఐ రీసెర్చ్ సంస్థ, ప్రముఖ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకుని, ఆర్1 పేరిట ఒక కొత్త ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది.
ఇది పూర్తిగా ఉచితం.ఈ అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్‌ను ఉచితంగా అందించడం విశేషం.
దీన్ని ఉపయోగించిన వారు, ఇతర ఏఐ మోడళ్లతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించారని సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు, దీంతో డీప్‌సీక్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ప్రస్తుతం ఆపిల్ యాప్ స్టోర్‌లో అగ్రస్థానంలో ఉన్న ఈ యాప్, గూగుల్ ప్లేస్టోర్‌లోనూ నంబర్ 1 స్థానంలో నిలిచింది.
అమెరికాతో పాటు దాదాపు 51 దేశాలలో డీప్‌సీక్ ప్లే స్టోర్‌లో అగ్రస్థానంలో ఉందని యాప్‌ఫిగర్స్ సంస్థ తెలిపింది.