Sunita Williams : 'గ్రాండ్ వెల్కమ్ టూ.. సునీత విలియమ్స్' .. సురక్షితంగా భూమిపైకి చేరుకున్న నాసా వ్యోమగాములు
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమికి విజయవంతంగా చేరుకున్నారు.
దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే గడిపిన వీరిద్దరూ, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిపైకి వచ్చారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండ్ అయ్యింది.
నాసా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని క్రూ డ్రాగన్‌ను ఒడ్డుకు చేర్చారు.
అనంతరం వీరిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
భూ గురుత్వాకర్షణానికి తాము తిరిగి సహజంగా అనుగుణంగా మారేందుకు నిపుణుల సహాయాన్ని పొందుతారు.
వివరాలు
నాసా ప్రత్యక్ష ప్రసారం
గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక 'స్టార్‌లైనర్' (Starliner) ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ISSకు వెళ్లారు.
ప్రణాళిక ప్రకారం,వారు కేవలం 8 రోజుల్లో భూమికి తిరిగి రావాల్సి ఉండగా,స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది.
ఈ కారణంగా,సునీతా, విల్మోర్‌లు ISSలోనే కొనసాగారు. పొడిగించిన మిషన్ తరువాత, అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్- X క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ISS నుంచి బయల్దేరి, మంగళవారం ఉదయం 10:15 గంటలకు భారత కాలమానం ప్రకారం అన్‌డాకింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
బుధవారం తెల్లవారుజామున ఇంజిన్లను మండించి క్రూ డ్రాగన్‌ను భూమి వాతావరణంలోకి ప్రవేశపెట్టారు.
ఈ ల్యాండింగ్ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భూమిపై సురక్షితంగా ల్యాండ్ అవుతున్న అంతరిక్ష నౌక దృశ్యాలు
Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu
— NASA (@NASA) March 18, 2025