Page Loader
Vivo Watch 3 : వివో వాచ్ 3 లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!
వివో వాచ్ 3 లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

Vivo Watch 3 : వివో వాచ్ 3 లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2023
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివో నుండి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది. దీని పేరు వివో వాచ్ 3. వివో X100 స్మార్ట్ ఫోన్‌తో పాటు వివో వాచ్ 3ని సోమవారం చైనాలో ఆ సంస్థ ఆవిష్కరించింది. డిసెంబర్ 2021లో ప్రవేశపెట్టిన Vivo వాచ్ 2 విజయంవంత కావడంతో, వివో వాచ్ 3ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ వాచ్ 505mAh బ్యాటరీని సొంతం చేసుకుంది. ఇందులో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లేతో పాటు Vivo బ్లూఓఎస్‌తో నడవనుంది. ఈ వాచ్ నాలుగు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ Vivo చైనా వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. నవంబర్ 21 నుండి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Details

వాయిస్ కాలింగ్ కోసం వాచ్ లో స్పీకర్, మైక్రోఫోన్

Vivo వాచ్ 3 బ్లూటూత్ వెర్షన్ ధర రూ.12,600, లెదర్ స్ట్రాప్‌తో ఉన్నది రూ. రూ. 13,700, మరోవైపు, eSIM సపోర్ట్‌తో కూడిన వాచ్ రూ. 14,900గా ఉంది. Vivo Watch 3 4GB RAM, 64GBతో వచ్చింది. ఇది హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. వాయిస్ కాలింగ్ కోసం, వాచ్‌లో స్పీకర్, మైక్రోఫోన్ ఉంటుంది. ఇది 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో కూడా వస్తుంది. ఈ వాచ్ 36 గ్రాముల బరువు ఉండనుంది.