ISRO Chairman: అంతరిక్షంలో నిరంతరం మానవ సంచారం ఉండాలని మోదీ అన్నారు : ఇస్రో చీఫ్
గాంధీనగర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్పేస్ కాన్ఫరెన్స్‌లో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని,ఆ కేంద్రంలో భారతీయులు పరిశోధనలు చెయ్యాలని ఆకాంక్షించారు. తన ప్రసంగంలో ఆయన ప్రధాని మోదీని కొనియాడారు.గుజరాత్ సీఎం గా ఉన్నపుడే మోదీ అంతరిక్ష పరిశోధనలపై ఫోకస్ పెట్టారని, ఆ సమయంలో అదే విజన్ తో పనిచేశారన్నారు. అంతరిక్షంలో మానవుల నిరంతరం సంచారం ఉండాలని ప్రధాని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతరిక్ష సంస్థ గగన్‌యాన్ మిషన్‌కు కూడా సిద్ధమవుతోందని తెలిపారు. చంద్రుడిపై ఇండియన్‌ను దించడమే లక్ష్యమని, 2040 నాటికి చంద్రుడిపై భారతీయు వ్యోమగామి ఉంటాడని భావిస్తున్నట్లు ఇస్రో చీఫ్ వెల్లడించారు.