Loading...
Welopoi Triple Star System: భూమికి దగ్గరలో ఖగోళ వింత...అరుదైన నక్షత్రాల కలయిక
భూమికి దగ్గరలో ఖగోళ వింత...అరుదైన నక్షత్రాల కలయిక

Welopoi Triple Star System: భూమికి దగ్గరలో ఖగోళ వింత...అరుదైన నక్షత్రాల కలయిక

వ్రాసిన వారు Balachander Sharma
Nov 24, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమికి కేవలం 28 కాంతి సంవత్సరాల దూరంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఓ అసాధారణ నక్షత్ర వ్యవస్థను గుర్తించారు. 'వెలోపోయి (Welopo'ai)'గా పిలుస్తున్న ఈ వ్యవస్థలో ఒక ఎర్ర మరుగుజ్జు నక్షత్రం, రెండు తెల్ల మరుగుజ్జు నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి కలయిక మనకు తెలిసిన 100 కాంతి సంవత్సరాల పరిధిలో మరెక్కడా కనిపించలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మూడు నక్షత్రాలు ఎలా ఒకే వ్యవస్థలోకి వచ్చాయన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. అందుకే ఈ ఆవిష్కరణ ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆసక్తిని పెంచుతోంది.

Details

ఉండకూడని వ్యవస్థగా ఎందుకు చెబుతున్నారు?

మాంట్రియల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఎటియెన్‌ ఆర్టిగో.. ఎర్ర మరుగుజ్జు నక్షత్రం చుట్టూ గ్రహాల కోసం అన్వేషిస్తున్న సమయంలో ఈ వ్యవస్థను గుర్తించారు.

మౌనా కీ పర్వతంపై ఉన్న కెనడా-ఫ్రాన్స్‌-హవాయి టెలిస్కోప్‌లోని SPIRou పరికరంతో పరిశీలనలు చేపట్టారు.

ఈ వ్యవస్థ గురించి మాట్లాడిన ఖగోళ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌ పాట్రిక్‌ డుఫోర్‌.. 'ఇది అసలు ఉండకూడదు.

ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్పడానికి సరైన వివరణ లేదు' అని పేర్కొన్నారు. హవాయి భాషలో కుటుంబ లక్షణాల మార్గం అనే అర్థం వచ్చే రెండు పదాల నుంచి వెలోపోయి పేరు వచ్చింది.

Details

తెల్ల మరుగుజ్జు నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి?

తెల్ల మరుగుజ్జు అనేది సూర్యుడి వంటి నక్షత్రం తనలోని హైడ్రోజన్ ఇంధనాన్ని పూర్తిగా వినియోగించుకున్న తర్వాత మిగిలే కేంద్ర భాగం.

ఇంధనం తగ్గినప్పుడు నక్షత్రం శక్తి ఉత్పత్తి మందగిస్తుంది. గురుత్వాకర్షణ ప్రభావంతో దాని కేంద్రం కుంచించుకుపోతుంది.

ఆ సమయంలో బయట పొరల్లోని హైడ్రోజన్ మండటంతో నక్షత్రం రెడ్‌ జెయింట్‌గా మారుతుంది.

చివరకు బయటి పొరలు అంతరిక్షంలోకి విడిపోయి, మధ్యలోని దట్టమైన కేంద్రం తెల్ల మరుగుజ్జుగా మిగులుతుంది.

ADVERTISEMENT

Details

సూర్యుడి వంటి రెండు నక్షత్రాల గతం ఏమిటి?

వెలోపోయి వ్యవస్థ తొలుత సూర్యుడి పరిమాణానికి దగ్గరగా ఉన్న రెండు నక్షత్రాలు, ఒక ఎర్ర మరుగుజ్జుతో ఏర్పడింది.

కాలక్రమంలో ఆ రెండు పెద్ద నక్షత్రాలు తమ జీవిత చక్రాన్ని ముగించి తెల్ల మరుగుజ్జులుగా మారాయి.

తక్కువ ద్రవ్యరాశి కలిగిన ఎర్ర మరుగుజ్జు మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.

వీటిలో ఒక తెల్ల మరుగుజ్జు ఎర్ర నక్షత్రానికి 129.3 ఖగోళ ప్రమాణాల దూరంలో పరిభ్రమిస్తోంది. ఒకసారి చుట్టిరావడానికి దానికి దాదాపు 1,000 సంవత్సరాలు పడుతుంది.

ADVERTISEMENT

Details

నక్షత్రాల ద్రవ్యరాశిని ఎలా లెక్కించారు?

ఎర్ర మరుగుజ్జు చుట్టూ గ్రహాల కోసం వెతుకుతున్నప్పుడు SPIRou పరికరం సెకనుకు 16.09 కిలోమీటర్ల వేగానికి సమానమైన రేడియల్‌ వెలాసిటీ సంకేతాలను గుర్తించింది.

వాటి ఆధారంగా పరిశోధకులు జెమిని నార్త్‌ టెలిస్కోప్‌ సాయంతో మరో తెల్ల మరుగుజ్జును గుర్తించారు. ఈ కొత్త నక్షత్రం ఎర్ర మరుగుజ్జుకు కేవలం 4.6 ఖగోళ ప్రమాణాల దూరంలో ఉంది.

దీని వల్ల శాస్త్రవేత్తలు రెండు నక్షత్రాల ద్రవ్యరాశిని కచ్చితంగా అంచనా వేయగలిగారు. ఎర్ర మరుగుజ్జు ద్రవ్యరాశి సూర్యుడిలో 42 శాతం కాగా, కొత్తగా గుర్తించిన తెల్ల మరుగుజ్జుది 62 శాతంగా తేలింది.

Details

నక్షత్రాల పరిణామంపై కొత్త పరిశోధనలకు అవకాశం

వెలోపోయి వ్యవస్థలోని నక్షత్రాల ద్రవ్యరాశి, వాటి మధ్య దూరాలను కచ్చితంగా కొలవగలగడం శాస్త్రవేత్తలకు కీలకమైన అవకాశం.

నక్షత్రాలు పుట్టడం, ఎదగడం, చివరకు తెల్ల మరుగుజ్జులుగా మారడం వంటి పరిణామాలను అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న నమూనాలను పరీక్షించవచ్చు.

ముఖ్యంగా ఒక నక్షత్రం తెల్ల మరుగుజ్జుగా మారినప్పుడు దాని ద్రవ్యరాశి ఎంత ఉండాలనే అంచనాలను మెరుగుపరచవచ్చు.

మూడు నక్షత్రాల ఈ అరుదైన కలయిక విశ్వంలోని నక్షత్రాల జీవిత చక్రంపై కొత్త ప్రశ్నలను ముందుకు తెచ్చింది.

ADVERTISEMENT