ఇకపై వాట్సాప్ లో View once సందేశాలను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు
'View once' సందేశాలను స్క్రీన్‌షాట్ తీయడాన్ని బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ లాంచ్ చేసింది. అక్టోబర్ 2022లో వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా బీటా ఛానెల్‌లో ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది 'View Once' ఆప్షన్ ద్వారా పంపిన చిత్రాలు లేదా వీడియోల స్క్రీన్‌షాట్‌లను తీసుకోకుండా వినియోగదారులను బ్లాక్ చేస్తుంది. అప్పటి నుండి స్క్రీన్‌షాట్-బ్లాకింగ్ ఆప్షన్ మెరుగుపడింది, స్క్రీన్ రికార్డింగ్‌ని ఉపయోగించే ఆప్షన్ కూడా బ్లాక్ చేశారు. వాట్సాప్ 'View Once' ఫీచర్, పేరుకు తగ్గట్టే మీడియాను ఒకసారి మాత్రమే చూడటానికి కుదురుతుంది. ఇంకా మెరుగ్గా ఉండటానికి యాప్ 'View Once' సందేశాల స్క్రీన్ రికార్డింగ్‌ను కూడా బ్లాక్ చేసింది.
స్క్రీన్ షాట్ తీయడానికి ప్రయత్నించినప్పుడు స్క్రీన్ షాట్ బ్లాక్ చేయబడింది అనే సందేశం వస్తుంది
'View Once' ఆప్షన్ ఉపయోగించి చిత్రాన్ని లేదా వీడియోను పంపినప్పుడు రిసీవర్ స్క్రీన్‌షాట్‌ను తీయలేరు. అలా చేస్తే స్క్రీన్ పై 'స్క్రీన్‌షాట్ బ్లాక్ చేయబడింది' అనే సందేశం వస్తుంది. స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కూడా బ్లాక్ చేసారు. 'View Once' సందేశాన్ని అందుకున్నవారు ఆ మీడియాను షేర్ చేయలేరు, స్టార్ చేయలేరు, ఫార్వార్డ్ చేయలేరు, ఫోటోలు/వీడియోలు కూడా ఫోన్ లో కూడా ఉండవు. వాట్సాప్ లో పాత వెర్షన్‌లో ఉన్న వినియోగదారులకు 'View Once' సందేశాన్ని పంపితే దానికి స్క్రీన్ షాట్ తీసుకోవడం కుదురుతుంది. ఆ సందేశాన్ని అందుకున్నవారు ఇప్పటికీ ఆ మీడియాను రికార్డ్ చేసుకోగలరు. బ్లాక్ చేసే ఫీచర్ కొత్త వెర్షన్ లో ఉంది. అది త్వరలోనే అందరికి అందుబాటులోకి వస్తుంది.