Year Ender 2024: ఈ సంవత్సరం భారతదేశాన్ని వణికించిన వ్యాధులు ఇవే..!
2024వ సంవత్సరం చివరి దశకు చేరుకుంది. అయితే ఈ ఏడాది దేశంలో పలు కొత్త వ్యాధులు ప్రజలందరిని భయభ్రాంతులకు గురి చేశాయి. నిపా, జికా, క్రిమియన్-కాంగో బ్లీడింగ్ ఫీవర్, క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ వంటి వైరస్‌లు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. నిపా వైరస్: జూనోటిక్ పారామిక్సోవైరస్‌గా పిలిచే ఈ వైరస్ ఆగ్నేయాసియాలో ప్రధానంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఇది తొలిసారిగా 2018లో కేరళలో నమోదు చేయబడింది. గబ్బిలాలు లేదా పందుల ద్వారా ఇది వ్యాపిస్తుంది. జికా వైరస్: ఏడెస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ 2021లో కేరళలో తొలిసారిగా గుర్తించబడింది. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్: గుజరాత్,రాజస్థాన్,కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో తొలిసారి నమోదైన ఈ వైరస్ 2024లో మరింతగా వ్యాప్తి చెందింది.
భారతదేశంలో వేగంగా వ్యాప్తిచెందిన కేఎఫ్‌డీ
చండీపురా వైరస్:దోమలు,పేలు,ఈగల ద్వారా వ్యాపించే ఈవైరస్ 1965లో మహారాష్ట్రలో తొలిసారిగా కనిపించింది.2024లో పలు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన కేసులు వెలుగుచూశాయి. డెంగ్యూ:ఏడెస్ ఈజిప్టి లేదా ఏడెస్ ఆల్బోపిక్టస్ ద్వారా వ్యాపించే డెంగ్యూ భారతదేశంలో మొదటిసారి 1780లో చెన్నైలో నమోదు చేయబడింది.2024లో డెంగ్యూ కేసులు అనేక రాష్ట్రాల్లో విస్తరించాయి. జపనీస్ ఎన్సెఫాలిటిస్:2024లో భారతదేశంలో ఈఎమర్జింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ తొలిసారి కనిపించింది. క్యాస్నూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ):2024లో ఇది భారతదేశంలో వేగంగా వ్యాప్తిచెందిన వైరల్ ఇన్ఫెక్షన్‌లలో ఒకటిగా మారింది. ఇతర వైరస్‌లు:హాంటావైరస్, చికున్‌గున్యా,హ్యూమన్ ఎంట్రోవైరస్-71,ఇన్ఫ్లుఎంజా,సార్స్ కరోనావైరస్ వంటి అనేక ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఈ విధంగా,2024లో కొత్త వైరస్‌ల కారణంగా దేశంలో ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.