LOADING...
Team India: బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఈసారి ఎవరికి దక్కిందో తెలుసా! 
బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఈసారి ఎవరికి దక్కిందో తెలుసా!

Team India: బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఈసారి ఎవరికి దక్కిందో తెలుసా! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2023
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టీమిండియా గెలుపు సాధించింది. ఇక నెదర్లాండ్స్ ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన ముంబైలో న్యూజిలాండ్ సవాల్‌కు కాచుకొని ఉంది. డచ్ జట్టుపై విజయం అనంతరం భారత జట్టు డ్రెస్సింగ్ రూములో బెస్ట్ ఫీల్డర్ అవార్డు జరిగింది. ఈసారి విజేత పేరును యాజమాన్యం కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఈసారి అందరిని గ్రౌండ్‌లోకి పిలిచి బెస్ట్ ఫీల్డర్ ని బిగ్ స్క్రీన్ పై చూపించారు.

Details

బెస్ట్ ఫీల్డర్ గా సూర్య కుమార్ యాదవ్

ఈసారి బిగ్ స్క్రీన్ పై వరుసగా రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ పోటోలను చూపించారు. ఆ వెంటనే 'డిసిషన్ పెండింగ్' అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. దాంతో విజేత పేరును ఇంగ్లీషులో విడివిడిగా S,U,R,Y,A పెద్ద అట్టముక్కలను ప్రదర్శించారు. దీన్ని చూసిన జట్టు సభ్యులు చప్పట్లో అభినందించారు. ఇక భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ సువాన్ సెనెవిరత్న సూర్యకు మెడల్ బహూకరించాడు. అనంతరం సూర్య మైదానంలో వారితో ఫొటోలు దిగారు.