బీసీసీఐ ఖజానాకు కాసుల పంట.. ఐసీసీ నుంచి ఏడాదికి రూ.2వేల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాదికే ఎన్నోవేల కోట్లు ఆర్జిస్తూ వరల్డ్ క్రికెట్‌లో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరు సంపాదించుకుంది. మరోసారి బీసీసీఐ ఖజానాకు కాసుల పంట పండింది.
ఐసీసీ నుంచి వచ్చే ఆదాయంలో బీసీసీఐ వాటా 72 శాతం పెరిగింది. దీంతో ఏడాదికి దాదాపు రూ.2వేల కోట్లను ఐసీసీ నుంచి బీసీసీఐ అందుకోనుంది. ఈ కొత్త రెవెన్యూ మోడల్‌కు ఐసీసీ ఆమోదం తెలిపినట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు.
ఐసీసీ ఇటీవల డర్బన్ వేదికగా జరిగిన బోర్డు మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సభ్యదేశాల క్రికెట్ బోర్డులకు చెల్లించాల్సిన మొత్తాలపై కొత్త రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ కు ఆమోదం తెలిపారు.
Details
2024 నుండి 2027 వరకు రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ అమలు
నూతన విధానం ప్రకారం ఐసీసీ ఆదాయంలో 38.5శాతం బీసీసీఐకి రానుంది. గతంలో ఇది 22.4 శాతంగా ఉండేది. అది కాస్తా ఇప్పుడు 72శాతం పెరిగి 38.5శాతానికి చేరింది. దీంతో బీసీసీఐకి 2వేల కోట్లు దక్కనున్నాయి.
ఐసీసీ ఇటీవల డర్బన్ వేదికగా జరిగిన బోర్డు మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సభ్యదేశాల క్రికెట్ బోర్డులకు చెల్లించాల్సిన మొత్తాలపై కొత్త రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ కు ఆమోదం తెలిపారు.
2024 నుండి 2027 వరకు ఈ నూతన రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ మోడల్ అమలులో ఉండనుంది.