Page Loader
Rohit Sharma: రోహిత్‌కు ఇది ఎన్నో ఐసీసీ టోర్నీనో తెలుసా..? 
రోహిత్‌కు ఇది ఎన్నో ఐసీసీ టోర్నీనో తెలుసా..?

Rohit Sharma: రోహిత్‌కు ఇది ఎన్నో ఐసీసీ టోర్నీనో తెలుసా..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

విరాట్‌, రోహిత్‌, జడేజా, షమీ వంటి అనుభవజ్ఞులతో టీమ్‌ ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌కు సిద్ధమైంది. తాజాగా దుబాయ్‌లో జట్టు యాడ్‌షాట్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫొటోషూట్‌కు జడేజా-రోహిత్‌ ఒకే కారులో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. పెద్ద గడ్డంతో ఉన్న జడేజాను చూసి రోహిత్‌ ''నువ్వు ఇలానే ఫొటోషూట్‌ చేస్తావా..?'' అని ప్రశ్నించాడు. దానికి జడేజా ''అవును'' అని సమాధానం ఇచ్చాడు.

వివరాలు 

2007, 2011 ప్రపంచకప్‌లలో నేను ఆడలేదు

దీంతో రోహిత్‌ స్పందిస్తూ... ''ఇది నాకు 15వది అనుకుంటా. 9 టీ20 ప్రపంచకప్‌లు,3 వన్డే ప్రపంచకప్‌లు, 2 ఛాంపియన్స్‌ ట్రోఫీలు. ఇప్పుడు మూడోది. మొత్తం 15 కదా? కాదు.. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లు 2 ఉన్నాయి.మొత్తం 17 సార్లు పిలిచారు'' అని చెప్పాడు. తర్వాత జడేజాను చూస్తూ ''నీవి కూడా అన్నే ఉంటాయి కదా..?''అని అడిగాడు. దానికి జడేజా స్పందిస్తూ, ''లేదు.. 2007, 2011 ప్రపంచకప్‌లలో నేను ఆడలేదు'' అని సమాధానమిచ్చాడు. అనంతరం వీరు ఫొటోషూట్‌ను ముగించుకున్నారు. తర్వాత జడేజాకు గిల్‌ ఎదురుకాగా, ''ఇది నీకు ఎన్ని ఫొటోషూట్‌లలో ఒకటి?'' అని ప్రశ్నించాడు. దానికి గిల్‌ లెక్కపెట్టి ''ఐదోది'' అని చెప్పాడు.అనంతరం కోహ్లీ,షమీ, పంత్‌,అయ్యర్‌ తదితరులు కూడా తమ ఫొటోషూట్‌ను పూర్తి చేసుకున్నారు.

వివరాలు 

ఈ హక్కు పాకిస్థాన్‌కే ఉంటుందని బీసీసీఐ స్పష్టత 

టీమ్‌ ఇండియాకు కొత్త జెర్సీని సోమవారం విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఈరోజు నిర్వహించారు. బీసీసీఐ తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో ఈ ఫొటోలను పంచుకుంది. ఈ జెర్సీలపై టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌ పేరు ఉంది. అయితే, భారత జెర్సీలపై పాకిస్థాన్‌ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు అభిమానులు డిమాండ్‌ చేయగా, బీసీసీఐ స్పష్టతనిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) నిబంధనలకు అనుగుణంగా జెర్సీలను రూపొందించినట్లు బీసీసీఐ ఇప్పటికే వెల్లడించింది. జెర్సీలపై ఉండే ట్రోఫీ లోగోపై ఆతిథ్య దేశం పేరు ఉండే హక్కు పాకిస్థాన్‌కే ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌ సైకియా ధ్రువీకరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జడేజా-రోహిత్‌ సంభాషణను ట్వీట్ చేసిన బీసీసీఐ