Page Loader
Team India : 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం.. 2027 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఏం చేయాలి?
2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం.. 2027 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఏం చేయాలి?

Team India : 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం.. 2027 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఏం చేయాలి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2023
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్‌లో చిన్న లోపాలపై భారత్ దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో జట్టు కూర్పులో, ఎంపికలో కొన్ని లోపాలను సరి చేయాల్సిన బాధ్యత ఉంది. వచ్చే నాలుగేళ్లలో బీసీసీఐ వాటిని సరి చేయాల్సిన అవసరం కూడా ఉంది. లెఫ్ట్ హ్యాండర్ల సమస్య టీమిండియాను ఎప్పటి నుంచో వేధిస్తోంది. జట్టులో ఉన్న ముగ్గురు పేసర్లు, బెంచ్ మీద ఉన్న ఇద్దరు పేసర్లు రైట్ హ్యాండ్ బౌలర్లే కావడం వల్ల ఇది ప్రత్యర్థి జట్లకు క్యాష్ అవుతున్నాయి. అర్షదీప్ సింగ్, చేతన్ సకారియా, నటరాజన్ వంటి లెఫ్టీలపై దృష్టి సారించాల్సిందే.

Details

పేస్ ఆల్ రౌండర్లపై దృష్టి సారించాలి

మరోవైపు లెప్ట్-రైట్ కాంబినేషన్ బ్యాటర్లు ఉండాల్సిందే. ప్రస్తుత జట్టులో ఆరు లేదా ఏడో డౌన్ వచ్చేంతవరకు ఎవరూ లేరు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే లెఫ్టీలగా ఉన్నారు. మిగిలిన జట్ల ఓపెనర్లలో ఒకరు రైట్, ఒకరు లెఫ్ట్ హ్యాండర్లగా బరిలోకి దిగుతారు. కానీ ఇండియా జట్టులో అలా జరగడం లేదు. ఇక యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే లాంటి వాళ్లను సానపెడతారో లేక కొత్తవాళ్లను ఎంపిక చేస్తారో వేచి చూడాల్సిందే. పేస్ ఆల్ రౌండర్లలో జట్టుకు హార్ధిక్ పాండ్యా ఒక్కడే ఉన్నాడు. అతని రిప్లేస్ మెంట్ కి మరో ఆటగాడు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా పేస్ ఆల్ రౌండర్ల పై బీసీసీఐ దృష్టి సారించాలి.