Page Loader
IPL 2024 : 77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్
77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్

IPL 2024 : 77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2023
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ (IPL) 2024 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. దుబాయ్‌లో కోకాకోలా ఎరినా వేదికగా ఈనెల 19న జరిగే వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. ఇందులో భారత్ ఆటగాళ్లతో పాటు, ఇటీవల వరల్డ్ కప్ సాధించిన ఆసీస్ ప్లేయర్లు కూడా ఉన్నారు. మొత్తం 77 ఖాళీలను భర్తీ చేసుకోవడానికి ఫ్రాంచైజీలు వీరిలోని అత్యుత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. ఈ ప్లేయర్ల జాబితాలో భారత్ ఆటగాళ్లు హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

Details

ఫ్రాంఛైజీల వద్ద రూ.262.95 కోట్లు

333 మంది ఆటగాళ్లలో 214 మంది భారత ప్లేయర్లు, 119 మంది విదేశీలయులు, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. వీరిని కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ. 262.95 కోట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమిన్స్, ట్రావిస్ హెడ్, ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్ లకు మంచి డిమాండ్ ఉంది. మరో వైపు న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర కనీస ధరకు రూ.50లక్షలుగా నిర్ణయించుకున్నాడు. కనీస ధర రూ. 1.5 కోట్ల ప్లేయర్లు.. మహ్మద్ నబీ - అఫ్గానిస్థాన్ క్రిస్ లిన్ - ఆస్ట్రేలియా టామ్ కరన్ - ఇంగ్లాండ్​ కొలిన్ మున్రో - న్యూజిలాండ్ హసరంగ - శ్రీలంక హోల్డర్ - వెస్టిండీస్ టిమ్ సౌథీ - న్యూజిలాండ్