Page Loader
Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా
579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా

Team India: 579 మ్యాచ్‌లు, 36 మంది కెప్టెన్లు.. అరుదైన ఘనతకు చేరువలో టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

1932, జూన్‌ 25న భారత క్రికెట్‌ చరిత్రలో మరుపురాని రోజు. భారత క్రికెట్‌ జట్టు తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌‌లో మైదానంలో అడుగుపెట్టింది. ఇప్పటికి 92 ఏళ్ల కాలం గడిచినా, టీమిండియా క్రికెట్‌ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు, 2023 సెప్టెంబర్ 23న, ఈ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఐదు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుండగా, భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఓటముల కంటే విజయాలు ఎక్కువగా ఉన్న జట్టుగా అవతరించనుంది.

Details

 15 ఏళ్లలో  78 విజయాలను సాధించిన టీమిండియా 

భారత క్రికెట్‌ జట్టు 1932లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించింది. మొదటి 20 ఏళ్ల కాలంలో ఏకైక విజయాన్ని 1952లో ఇంగ్లండ్‌పై సాధించింది, అది కూడా చెన్నైలోని చిదంబరం స్టేడియంలోనే కావడం గమనార్హం. ఇప్పుడు, అదే స్టేడియం వేదికగా, భారత్‌ బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే, క్రికెట్‌ చరిత్రలో అత్యధిక టెస్ట్‌ విజయాలు సాధించిన నాలుగో జట్టుగా నిలవనుంది. 1988 వరకు భారత జట్టు ఎన్నడూ ఎక్కువ విజయాలతో ఏదైనా సంవత్సరం ముగించలేదు. 2009లో 100వ టెస్ట్‌ విజయం సాధించడానికి టీమ్‌ 432 మ్యాచ్‌లు ఆడింది. అప్పటివరకు విజయశాతం 23.14 మాత్రమే ఉండగా, గత 15 ఏళ్లలో టీమ్‌ఇండియా 78 విజయాలను నమోదు చేసి విజయశాతాన్ని 53.06కి పెంచుకుంది.

Details

92 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం 

ప్రస్తుతం టీమ్‌ఇండియా 579 టెస్టులు ఆడగా, 178 విజయాలు, 178 ఓటములు, 222 డ్రాలు, ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. సెప్టెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్ట్‌లో విజయం సాధిస్తే, భారత క్రికెట్‌ జట్టు చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పుతుంది. భారత క్రికెట్‌ జట్టు సారధ్య బాధ్యతలు మొత్తం 36 మంది కెప్టెన్లు చేపట్టారు. మొదటి కెప్టెన్‌ సీకే నాయుడు నుంచి ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌శర్మ వరకు, ప్రతి కెప్టెన్‌ జట్టుకు కీలక విజయాలను అందించారు. ఈ 92 ఏళ్ల ప్రయాణంలో మొత్తం 314 మంది క్రికెటర్లు భారత జట్టు తరఫున టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడారు.