Page Loader
WTC 2025-27: 9 జట్లు, 131 టెస్టులు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మళ్లీ ప్రారంభం
9 జట్లు, 131 టెస్టులు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మళ్లీ ప్రారంభం

WTC 2025-27: 9 జట్లు, 131 టెస్టులు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మళ్లీ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సీజన్ జూన్ 17 నుంచి ప్రారంభమవుతోంది. ఇటీవల ముగిసిన 2023-25 సీజన్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్‌గా నిలిచిన అనంతరం, ఇప్పుడు ఐసీసీ మరోసారి కొత్త చక్రాన్ని మొదలుపెట్టింది. ఈ సారి టెస్టు క్రికెట్ ప్రేమికులకు మరోసారి రసవత్తర సమరాన్ని అందించబోతోంది. ఈ సరికొత్త సీజన్‌లో మొత్తం 131 టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 9 జట్లు ఈ సైకిల్‌లో పాల్గొంటున్నాయి. మొదటి టెస్ట్ జూన్ 17 నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య గాలెలో జరగనుంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌తో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పనున్నాడు. ఈ నేపథ్యంలో మాథ్యూస్ WTC 2025-27 సీజన్‌లో రిటైర్మెంట్ తీసుకున్న తొలి క్రికెటర్‌గా నిలవనున్నాడు.

Details

జట్ల వారీగా మ్యాచ్‌ల సంఖ్యను చూస్తే

ఆస్ట్రేలియా అత్యధికంగా 22 టెస్టులు ఆడనుంది. ఇంగ్లాండ్ 21 టెస్టులు ఆడుతుంది. భారత జట్టు మొత్తం 18 టెస్టులు ఆడనుంది. ఇందులో 9 మ్యాచ్‌లు స్వదేశంలో, మిగతా 9 విదేశాల్లో జరగనున్నాయి. న్యూజిలాండ్ 16 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ చెరో 14 మ్యాచ్‌లు పాకిస్తాన్ 13 టెస్టులు, శ్రీలంక, బంగ్లాదేశ్ చెరో 12 మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. ఈ సీజన్‌లో కూడా టెస్టు క్రికెట్‌కు ఉత్సాహాన్ని కొనసాగించేందుకు ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. జట్ల మధ్య ఈ పోటీలు ఫైనల్‌కు అర్హత సాధించే రెండు జట్లను తేల్చేలా ఉండనున్నాయి.