Page Loader
UP WC 2024 : హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో ఛాన్స్!
హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో ఛాన్స్!

UP WC 2024 : హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2023
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ(BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన మురగన్ అభిషేక్(Murugan Abhishek), ఆరవెల్లి అవినాష్(Aravelli Avinash Rao) రావులకు భారత జట్టులో గోల్డెన్ ఛాన్స్ లభించింది. అవినాష్ వికెట్ కీపర్‌గా, అభిషేక్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్‌గా ఆసియా కప్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచ కప్ జట్టుకు పంజాబ్ కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా, మధ్యప్రదేశ్‌కు చెందిన సౌమ్యకుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు.

Details

అండర్-19 ప్రపంచ కప్ కు ఎంపికైన జట్టు ఇదే

దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ప్రపంచ కప్ జరగనుంది. అండర్-19 ప్రపంచ కప్ జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లు చోటు దక్కడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. అండర్‌-19 ప్రపంచకప్‌కు భారత జట్టు ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్‌ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్‌ ఖాన్, అవినాశ్‌ రావు, మురుగన్‌ అభిషేక్‌, ఇనేశ్‌ మహాజన్, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి.