David Warner: దయచేసి నా 'బ్యాకీ గ్రీన్' ఇవ్వండి.. ఆ క్యాప్ నాకెంతో సెంటిమెంట్ : డేవిడ్ వార్నర్
రేపటి నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచుతో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ పలుకుతున్నారు. ఈ మ్యాచుకు ముందు వార్నర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో అతను ఉద్వేగభరిత విజ్ఞప్తి చేశారు. దురదుష్టవశాత్తూ తన బ్యాక్ ప్యాక్ లో ఉన్న బ్యాగీ గ్రీన్ టెస్టు క్యాప్ ను ఎవరో దొంగలించారని, సిడ్నీలో దిగిన తర్వాత అది గమనించానని వార్నర్ చెప్పారు. తన క్యాప్ ను తిరిగి ఇచ్చేయాలని వార్నర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా కోరారు.
తాను ఎదుర్కొన్న అత్యంత కఠిన బౌలర్ డెయిల్ స్టెయిన్ : డేవిడ్ వార్నర్
లగేజి నుంచి తన బ్యాగ్‌ను ఎవరో తీసుకున్నారని, అందులో తన పిల్లల వస్తువులు, బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉందన్నారు. అది తనకెంతో సెంటిమెంట్ అని, దానిని ధరించే చివరి మ్యాచ్ ఆడాలనుకున్నానని వెల్లడించారు. ఎవరైనా బ్యాక్ ప్యాక్ తీసుకుంటే వారికి మరో బ్యాక్ ప్యాక్ ఇస్తానని, వారికి ఎలాంటి ఇబ్బందికి గురి చేయనని వార్నర్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలించినా దొరకలేదన్నారు. ఇక తన టెస్టు కెరీర్ లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టెయిన్ అని వార్నర్ వెల్లడించారు.