Page Loader
BAN Vs SL : శ్రీలంకపై బంగ్లా గ్రాండ్ విక్టరీ
శ్రీలంకపై బంగ్లా గ్రాండ్ విక్టరీ

BAN Vs SL : శ్రీలంకపై బంగ్లా గ్రాండ్ విక్టరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2023
10:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో శ్రీలంకపై బంగ్లా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసి ఆలౌటైంది. చరిత్ అసలంక 105 బంతుల్లో (6 ఫోర్లు, 5 సిక్సర్లు) 108 పరుగులతో చెలరేగాడు. పాతుమ్ నిస్సాంక (41), సమరవిక్రమ(41),ధనుంజయ డి సిల్వా 34 పరుగులతో ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తాంజిమ్ హసన్ సాకిబ్ 3 వికెట్లు తీయగా, కెప్టెన్ షకీబ్, షారిఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు.

Details

రాణించిన  నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హాసన్

లక్ష్య చేధనకు బంగ్లాదేశ్ కు ఆరంభంలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ తాంజిద్ హసన్ 9 పరుగులకే పెవిలియానికి చేరగా మరో ఓపెనర్ లిట్టన్ దాస్(23)కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ క్రమంలో నజ్ముల్ హుస్సేన్ శాంటో (90), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(82) లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ మూడో 169 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో మహ్మదుల్లా వేగంగా 22 పరుగులు ఔట్ అయ్యాడు. తర్వాత తౌహిద్ హృదయ్ (15*) చివరి వరకు బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. బంగ్లా 41.1 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించింది. లంక్ బౌలర్లలో మధుశంక 3, మాథ్యూస్ 2, తీక్షణ ఓ వికెట్ పడగొట్టారు.