Page Loader
West Indies: క్రికెట్ చరిత్రలో మహత్తర ఘట్టం.. తొలి వన్డే ప్రపంచకప్ స్వర్ణోత్సవ సంబరాలకు వెస్టిండీస్ సిద్ధం
క్రికెట్ చరిత్రలో మహత్తర ఘట్టం.. తొలి వన్డే ప్రపంచకప్ స్వర్ణోత్సవ సంబరాలకు వెస్టిండీస్ సిద్ధం

West Indies: క్రికెట్ చరిత్రలో మహత్తర ఘట్టం.. తొలి వన్డే ప్రపంచకప్ స్వర్ణోత్సవ సంబరాలకు వెస్టిండీస్ సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

సరిగ్గా 50 ఏళ్ల క్రితం తొలి వన్డే ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 1975 జూన్ 21న లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, దిగ్గజ సారథి క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు, ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి తొలి ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. స్వర్ణోత్సవ వేడుకలపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటన ఈ చారిత్రక విజయానికి 50 సంవత్సరాలు పూర్తి కావడంతో, క్రికెట్ వెస్టిండీస్ (CWI) CEO క్రిస్ డెహ్రింగ్ స్పందించారు. తాము స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అయితే వేడుకలకు సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Details

జూన్ 25న బార్బడోస్‌లో ప్రత్యేక కార్యక్రమం 

అయితే ఈ వేడుకలు ఈ ఏడాది జూన్ 25న బార్బడోస్‌లో నిర్వహించే అవకాశముందనే సమాచారం. వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో కీలక ఘట్టమైన 1975 ప్రపంచకప్ విజయం ఎప్పటికీ చిరస్మరణీయమే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంబరాలను అట్టహాసంగా నిర్వహించేందుకు సీడబ్ల్యూఐ యోచనలో ఉంది. క్రికెట్ అభిమానులు ఈ ప్రత్యేక వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.