Asian games: ఆసియా క్రీడల్లో సత్తా చాటిన చాయ్‌వాలా కూతురు.. హెప్లాటిస్‌లో నందినికి కాంస్యం
చాయ్‌వాలా కూతురు అగసర నందిని ఆసియా గేమ్స్ లో సత్తా చాటింది. ఏడు పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి కంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్లాథ్లాస్ ఫైనల్లో 5712 పాయింట్లతో నందిని మూడో స్థానంలో నిలిచింది. కటిక పేదరికాన్ని అనుభవించిన అగసర నందిని, అసియా క్రీడల్లో గురుకుల అథ్లెట్‌గా కంచు మోత మోగించింది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లోనే కష్టమైన హెప్లాథ్లాస్‌లో కాంస్య పతకం నెగ్గి తెలంగాణతో పాటు దేశఖ్యాతిని ఇనుమడింపజేసింది. నందిని ప్రస్తుతం సంగారెడ్డి గురుకుల కళాశాలలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతోంది.
తెలంగాణ ప్లేయర్లను అభినందించిన కేసీఆర్
ఆసియా క్రీడల చరిత్రలో భారత్ రికార్డు సృష్టించింది. ఎనిమిదో రోజు ఏకంగా 15 పతకాలను కైవసం చేసుకుంది. బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్య పతకంతో రాణించగా, హైదరాబాదీ షూటర్ కైనస్ చెనాయ్ డబుల్ ధమాకా మోగించాడు. మరోవైపు షాట్‌పుట్ ప్లేయర్ తజిందర్ వరుసగా రెండోసారి పసిడి పతకాన్ని ముద్దాడాడు. 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగు అమ్మాయి జ్యోతి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ఆదివారం పోటీలు ముగిసే సరికి భారత్ 53 పతకాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తెలంగాణ ప్లేయర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలను తెలిపారు.