Asia Cup 2023: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. తొలి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం
ఆసియా కప్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు. దీంతో పాకిస్థాన్, నేపాల్ మ్యాచులకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. రేపు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా, మరో వారం తర్వాత లంకకు రాహుల్ పయనం కానున్నాడు. గాయం నుంచి ఇటీవల కోలుకున్న రాహుల్, ఇంకా వందశాతం ఫీట్‌గా లేనట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ గాయం నుంచి క్రమ క్రమంగా కోలుకుంటున్నాడని, నెట్ సెషన్స్‌లో బాగా రాణిస్తున్నాడని, అయితే ఫస్ట్ రెండు మ్యాచులకు అతను అందుబాటులో ఉండడం లేదని ద్రవిడ్ వెల్లడించారు.
కేఎల్ రాహుల్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్?
ఇక కేఎల్ రాహుల్ సూపర్ - 4 స్టేజీ నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు తమ ఫస్ట్ మ్యాచును సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాడు దూరం కావడం భారత్ ను దెబ్బతీస్తుందని పలువురు మాజీ క్రికెట్లర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వచ్చే నెల 3వ తేదీన వరల్డ్ కప్‌కి భారత జట్టుని ప్రకటిస్తుండగా, ఆ జట్టులో రాహుల్ చోటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.