Team India : ఇంగ్లండ్‌తో మ్యాచుకు ముందు టీమిండియాకు భారీ షాక్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. ఇక ఆక్టోబర్ 29న లక్నో వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్‌తో పోటీపడనుంది.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్, ఈ మ్యాచులో నెగ్గి కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇదిలా ఉండగా, ఇంగ్లండ్‌తో మ్యాచుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
భారత్ స్టార్ ఆల్ రౌండర్ హర్థిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఇక అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Details
రెండు మ్యాచులకు పాండ్యా దూరం
ఈనెల 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంకతో జరగనున్న మ్యాచులకు అందుబాటులో ఉండరని జాతీయ మీడియా స్పష్టం చేసింది.
చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్న అతడు ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నారు.
పాండ్యా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
నవంబర్ 5న ధక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచుకు హార్ధిక్ పాండ్యా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతున్న భారత్ తదుపరి మ్యాచులోనూ ఇంగ్లండ్‌ను మట్టికరిపిస్తే సెమీస్ కు చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.