Page Loader
Rohit Sharma: రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో కీల‌క మార్పు.. బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా!
రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో కీల‌క మార్పు.. బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా!

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో కీల‌క మార్పు.. బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండు, మూడవ టెస్టుల్లో రోహిత్ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ టెస్టులో కేఎల్ రాహుల్ మూడవ నెంబరులో బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని ఒక మీడియా రిపోర్టు వెల్లడించింది. అయితే శుభమన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఈ టెస్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవాలని భారత జట్టు భావిస్తున్నట్లు సమాచారం.

Details

అరుదైన రికార్డుకు చేరువలో మిచెల్ స్టార్క్

అందులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశముంది. సుందర్ ప్లేస్ కన్ఫర్మ్ అయితే, నితీశ్ రెడ్డి బెంచ్ కి పరిమితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డుకు దగ్గర్లో ఉన్నారు. అయిదు వికెట్లు తీస్తే, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు సాధించిన ఆసీస్ బౌలర్ల జాబితాలో చేరతాడు. ఇప్పటికే షేన్ వార్న్ (1001 వికెట్లు), గ్లెన్ మెక్‌గ్రాగ్ (949 వికెట్లు), బ్రెట్ లీ (718 వికెట్లు) ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం 284 అంతర్జాతీయ మ్యాచుల్లో స్టార్క్ 695 వికెట్లు తీసుకున్నాడు.