Page Loader
AUS vs IND: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన రికార్డులివే..
తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన రికార్డులివే..

AUS vs IND: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘన విజయం.. నమోదైన రికార్డులివే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2024
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో టీమిండియా చారిత్రాత్మక విజయంతో శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295పరుగుల తేడాతో మట్టికరిపించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 534పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 238పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో,టీమిండియా ఆస్ట్రేలియాపై దిమ్మతిరిగే ప్రదర్శన చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150పరుగులు చేయగా,ఆసీస్ 104పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అంతేకాకుండా,ఆస్ట్రేలియా గడ్డపై అతను కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 40 వికెట్లు పూర్తి చేసి మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

వివరాలు 

టెస్టుల్లో అత్యుత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్లు 

ఈ విజయంలో టీమిండియా పలు కీలక రికార్డులు సృష్టించింది. అవేంటో తెలుసుకుందాం... టెస్టుల్లో అత్యుత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్లు వీరే.. 10/135 - కపిల్ దేవ్ vs వెస్టిండీస్‌, (అహ్మదాబాద్,1983) 10/194 - బిషన్ సింగ్ బేడీ vs ఆస్ట్రేలియా (పెర్త్, వాకా స్టేడియం,1977) 9/70 - బిషన్ సింగ్ బేడీ vs న్యూజిలాండ్ (చెన్నై,1976) 8/72 - జస్‌ప్రీత్‌ బుమ్రా vs ఆస్ట్రేలియా (పెర్త్, ఆప్టస్ స్టేడియం,2024) 8/109 - కపిల్ దేవ్ vs ఆస్ట్రేలియా (అడిలైడ్, 1985)

వివరాలు 

ఆసియా వెలుపల భారత్‌కు అతిపెద్ద విజయాలు (పరుగుల పరంగా) 

318 పరుగులు - వెస్టిండీస్‌పై (నార్త్ సౌండ్, 2019) 295 పరుగులు - ఆస్ట్రేలియాపై (పెర్త్, ఆప్టస్ స్టేడియం, 2024) 279 పరుగులు - ఇంగ్లాండ్‌పై (హెడింగ్లీ, 1986) 272 పరుగులు - న్యూజిలాండ్‌పై (ఆక్లాండ్, 1968) 257 పరుగులు - వెస్టిండీస్‌పై (కింగ్‌స్టన్, 2019)

వివరాలు 

ఆస్ట్రేలియాపై భారత్‌ అతిపెద్ద విజయాలు (పరుగుల పరంగా) 

320 పరుగులు - (మొహాలీ 2008) 295 పరుగులు - (పెర్త్, 2024) 222 పరుగులు - (మెల్‌బోర్న్, 1977) 179 పరుగులు - (చెన్నై, 1998) 172 పరుగులు - (నాగ్‌పూర్, 2008)

వివరాలు 

21వ శతాబ్దంలో స్వదేశంలో జరిగిన సిరీస్‌ల్లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయిన సందర్భాలు 

సౌతాఫ్రికాపై - పెర్త్ (వాకా స్టేడియం), 2008 సౌతాఫ్రికాపై - పెర్త్ (వాకా స్టేడియం), 2016 భారత్‌పై - అడిలైడ్ 2018 భారత్‌పై - పెర్త్ (ఆప్టస్), 2024

వివరాలు 

ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆలౌటై 400 కంటే తక్కువ పరుగులు చేసిన సందర్భాలు 

246 పరుగులు - సౌతాఫ్రికాపై (హోబర్ట్, 2016) 342 పరుగులు - భారత్‌పై (పెర్త్, 2024) 356 పరుగులు - ఇంగ్లాండ్‌పై (మెల్‌బోర్న్‌, 2010) 369 పరుగులు - న్యూజిలాండ్‌పై (హోబర్ట్, 2011) 395 పరుగులు - భారత్‌పై (మెల్‌బోర్న్, 2020)