Page Loader
రాజస్థాన్, లక్నో ఆటగాళ్ల ఫర్మామెన్స్‌పై ఓ లుక్కేయండి!
ఈ సీజన్‌లో బట్లర్ ఐదు మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేశాడు

రాజస్థాన్, లక్నో ఆటగాళ్ల ఫర్మామెన్స్‌పై ఓ లుక్కేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2023
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గత సీజన్లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడగా.. ఈ రెండిట్లోనూ రాజస్థానే విజయం సాధించింది. ఈ ఐపీఎల్ సీజన్‌ను రాజస్థాన్, లక్నో జట్లు అద్భుతంగా ప్రారంభించాయి. జోస్ బట్లర్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, అయితే అతను గత మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అవేష్ ఖాన్‌, జోస్ బట్లర్ ని ఔట్ చేయాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాడట.ఇప్పటివరకూ అవేశ్ ఖాన్ ఐపీఎల్ లో బట్లర్ ని రెండుసార్లు ఔట్ చేశాడు.

details

లక్నో విజయం సాధించేనా?

సంజూ శాంసన్, రషీద్ ఖాన్ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి విజృంభించాడు. అయితే అమిత్ మిశ్రా బౌలింగ్ లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. KL రాహుల్ పవర్ ప్లేలో పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇక టెంట్ర్ బౌల్ట్ పవర్ ప్లేలో వికెట్లు తీసి రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ వీరిద్దరూ ఎనిమిది ఇన్నింగ్స్ లు ఆడారు. ఇందులో రెండుసార్లు ట్రెంట్ బౌల్ట్.. రాహుల్ ని ఔట్ చేశాడు. చాహల్ 11 వికెట్లు తీసి ఈ సీజన్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే చాహల్ బౌలింగ్ లో నికోలస్ పూరన్ ఒకసారి ఔట్ అయ్యాడు. సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో 47 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 32 మ్యాచ్‌ల్లో నెగ్గింది