Page Loader
Sakshi Malik : రిటైర్మెంట్ ప్రకటించాను కానీ.. సాక్షి మాలిక్
రిటైర్మెంట్ ప్రకటించాను కానీ.. సాక్షి మాలిక్

Sakshi Malik : రిటైర్మెంట్ ప్రకటించాను కానీ.. సాక్షి మాలిక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2023
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) ను భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడాన్ని రెజ్లర్లు స్వాగతిస్తున్నారు. అయితే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) లేదా దాని చీఫ్ సంజయ్ సింగ్ సస్పెన్షన్ గురించి తాను రాత పూర్వకంగా చూడలేదని మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshi Malik) పేర్కొంది. తమ పోరాటం పోరాటం ప్రభుత్వంతో కాదని ఆమె తెలిపింది. ఎన్నిక‌ల్లో గెలిచిన అనంత‌రం క్రీడా శాఖ‌ను సంప్ర‌దించ‌కుండానే సంజ‌య్‌ జాతీయ స్థాయి అండ‌ర్ -15, అండ‌ర్-20 రెజ్లింగ్ పోటీలు ఉత్త‌రప్ర‌దేశ్‌లో జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో సంజ‌య్.. జాతీయ క్రీడా నిబంధ‌న‌లను ఉల్లంఘించార‌ని అత‌డి బృందాన్ని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు మంత్రిత్వ శాఖ‌ ప్ర‌క‌టించింది.

Details

మహిళా అధ్యక్షురాలిని నియమిస్తేనే అభ్యున్నతి

తాను రిటైర్మెంట్ ప్రకటించానని, అయితే రాబోయే రెజ్లర్లకు న్యాయం చేయాలని సాక్షి మాలిక్ తెలిపారు. కొత్తగా ఏర్పడే ఫెడరేషన్ ప్రకారం తన నిర్ణయాన్ని తెలియజేస్తానని ఆమె వెల్లడించారు. మంచి ఫెడరేషన్‌గా వర్థిల్లాలంటే తమకు మహిళా అధ్యక్షురాలు రావాలని, రెజ్లర్ల అభ్యున్నతి కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు.