
Corbyn's bash: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన కార్బిన్ బాష్
ఈ వార్తాకథనం ఏంటి
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ నమోదు కాని రికార్డును సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ నెలకొల్పాడు. పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బాష్ అరంగేట్రంలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తర్వాత 80 పైగా స్కోరు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతను 81 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బాష్ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. అతను నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తో 81 పరుగులు చేసి రికార్డు నమోదు చేశాడు.
Details
93 బంతుల్లో 81 పరుగులు
దీంతో బాష్ దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత నాలుగు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. బాష్ 93 బంతుల్లో 81 నాటౌట్ గా నిలవడంతో ఆ జట్టు 301 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.