Page Loader
వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి
వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి

వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ట్విస్ట్.. పాక్ జట్టు భారత్‌కు రాదన్న పాక్ మంత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 09, 2023
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రభావం వన్డే ప్రపంచ కప్ 2023పై పడింది. ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్ కు వెళ్లమని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆసియా కప్‌ను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. అయితే వన్డే ప్రపంచ కప్ కోసం భారత్‌కు తమ జట్టును పంపండపై పాకిస్థాన్ రోజుకో ఓ మాట మాట్లాడుతోంది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రీడా మంత్రి ఇషాన్ మజారీ కీలక వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికల్లో ఆసియా కప్ ఆడాలని భారత్ పట్టుబడితే, ప్రపంచ కప్ కోసం భారత్‌కు వెళ్లొద్దని పాక్ జట్టుకు ఆ దేశ మంత్రి సూచించారు.

Details

కమిటీని ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని

భారత్ ఆసియా కప్ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడాలని డిమాండ్ చేస్తే తాము కూడా ప్రపంచ కప్ మ్యాచుల కోసం భారత్‌కు అదే డిమాండ్‍ను చేయాల్సి ఉంటుందని ఇషాన్ మజూరీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన పరిధిలోని వస్తుందని అందుకే తాను ఈ సూచనలు చేస్తున్నానని పేర్కొన్నారు. పాకిస్థాన్ జట్టును భారత్ కు పంపాలా! వద్దా అన్న విషయంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఓ కమిటీని నియమించిన కొన్ని గంటల్లోనే క్రీడా మంత్రి మజారీ ఈ వ్యాఖ్యలను చేశారు. షెహబాబ్ షరీఫ్ నియమించిన కమిటీకి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో పాక్ క్రీడా మంత్రి సభ్యునిగా ఉండడం గమనార్హం.