IND vs AUS: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. ఫైనల్‌కు టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో టీమిండియా సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై నాలుగు తేడాతో గెలుపొంది, ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఆస్ట్రేలియా నిర్ధేశించిన 264 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే చేధించింది.
ఈ మ్యాచులో టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ(84), శ్రేయాస్ అయ్యర్(44), కేఎల్ రాహుల్ (42) రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఆసీస్ బౌలర్లలో అడమ్ జంపా, నాథన్ ఎల్లీస్ తలా రెండు వికెట్లు తీశారు.
Details
రాణించిన టీమిండియా బౌలర్లు
చివర్లో హార్ధిక్ పాండ్యా 28 పరుగులతో చేలరేగడంతో టీమిండియా 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను పూర్తి చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(73), అలెక్స్ క్యారీ(61) ఫర్వాలేదనిపించారు.
ఇక టీమిండియా బ్యాటర్లలో మహ్మద్ షమీ 3, వరుణ్ చక్రవర్తి, జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్, హార్దిక్ ఒక్కో వికెట్ తీశారు.
రేపు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.