Abhishek Sharma: మరోసారి నిరాశపరిచిన అభిషేక్ శర్మ..ఏం చేశాడంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన అభిషేక్, రాజస్థాన్ రాయల్స్ పై తొలి బంతికే ఔట్ అయ్యాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా ఎస్‌ఆర్‌హెచ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి అభిషేక్ వికెట్ కోల్పోయాడు. ఇన్నింగ్స్ మొదటి బంతినే భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించిన అభిషేక్, ముందుకు వచ్చి ఆడే ప్రయత్నంలో తప్పు చేశాడు. షార్ట్ బాల్‌పై సరిగా కనెక్ట్ కాలేకపోయిన అతను టాప్ ఎడ్జ్ ఇచ్చాడు. దాంతో రవీ బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడంతో అభిషేక్ డక్‌గా వెనుదిరిగాడు.
వివరాలు
ఐపీఎల్‌లో రెండో డకౌట్..
2026లో టీ20ల్లో అభిషేక్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు అతను 18 మ్యాచ్‌ల్లో 7 సార్లు డక్ అయ్యాడు. మొత్తం 452 పరుగులు సాధించిన అతని సగటు 26.58గా ఉండగా, స్ట్రైక్ రేట్ 203.6గా ఉంది. ఇందులో 5 అర్ధశతకాలు ఉన్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇది అతనికి రెండో డక్. ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్పై కూడా అతను డక్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతని స్కోర్లు 7, 48, 0, 74, 0గా ఉన్నాయి.
వివరాలు
ఐపీఎల్ రికార్డులివే..
మొత్తం టీ20 కెరీర్‌లో ఇది అభిషేక్‌కు 16వ డక్. 186 మ్యాచ్‌లు (182 ఇన్నింగ్స్) ఆడిన అతను 5,370 పరుగులు చేసి 32.34 సగటు, 173.95 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇందులో ఐపీఎల్‌లోనే 82 మ్యాచ్‌ల్లో 5 డక్‌లు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అతని సగటు 27.01గా ఉంది. రాజస్థాన్ రాయల్స్‌పై కూడా ఇది అతనికి రెండో డక్ కావడం గమనార్హం. ఆ జట్టుపై 9 మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 19గా ఉండగా, స్ట్రైక్ రేట్ 134.34గా నమోదైంది.