అప్ఘనిస్తాన్ ఓపెనర్ అరుదైన ఘనత.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు
ఆప్గనిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాబ్ చరిత్రను సృష్టించాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్, ఓ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు. 21 వయస్సులోనే అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్బాజ్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకూ వన్డేల్లో 5 సెంచరీలను సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును గుర్బాజ్ బ్రేక్ చేశాడు. సచిన్ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలను మాత్రమే సాధించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ ఓపెనర్ ఉపుల్ తరంగా, దక్షిణాఫ్రికా స్టార్ ఓపెపర్ క్వింటన్ డికాక్ చెరో 6 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్బాజ్
అదే విధంగా గుర్బాజ్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా గుర్బాజ్ రికార్డుకెక్కాడు. కేవలం 23 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిని గుర్బాజ్ చేరుకున్నాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం రికార్డును కూడా గుర్బాజ్ బ్రేక్ చేయడం గమనార్హం. బాబర్ 25 ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధించగా, క్వింటాన్ డికా్, పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ చెరో 13 ఇన్నింగ్స్ లతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.