
AFG Vs AUS : ఆఫ్ఘనిస్తాన్‌దే టాస్.. ఇరు జట్లలో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది.
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్, ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆస్ట్రేలియాతో ఈ మ్యాచులో నెగ్గి సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలని భావిస్తోంది.
ఇక టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆష్గాన్ ఎలాగైనా ఆసీస్ పై నెగ్గి సెమీస్‌కు మరింత చేరువగా వెళ్లాలని గట్టి పట్టుదలతో ఉంది.
నేడు జరిగే మ్యాచ్ తర్వాత సెమీస్ చేరే జట్ల విషయంలో కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ మ్యాచులో ఆస్ట్రేలియా రెండు మార్పులను చేయగా, ఆఫ్గానిస్తాన్ ఒక మార్పులను చేసింది.
Details
ఇరు జట్లలోని సభ్యులు
ఆఫ్ఘనిస్తాన్ జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్(w), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హ
ఆస్ట్రేలియా జట్టు
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్