కుంబ్లే తో గొడవ తరువాత.. కోచ్ గా ఉండాలని కోహ్లీ కోరాడు : సెహ్వాగ్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే 2016లో భారత ప్రధాన కోచ్ గా పదవి బాధ్యతలను చేపట్టాడు. అయితే 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. కుంబ్లే స్థానంలో అప్పటివరకు టీమిండియా క్రికెట్ డైరక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్ బాధ్యతలను తీసుకున్నాడు.
ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ 2017లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో కుంబ్లే ప్రధాన కోచ్‌గా తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. మరోవైపు బీసీసీఐ కుంబ్లే కాంట్రాక్టను పొడిగించలేదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
అప్పట్లో అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఈ అంశంపై తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
సెహ్వాగ్
హెడ్ కోచ్ ఉండనని కోహ్లీకి చెప్పా: సెహ్వాగ్
కుంబ్లే హెడ్ కోచ్ నుంచి తప్పుకున్నాక, తనని ఆ బాధ్యతలను చేపట్టమని బీసీసీఐ కోరిందని, 2017లో అప్పటి బీసీసఐ సెక్రటరీ అమితాబ్ చౌదరి, విరాట్ కోహ్లీ తనని కలిశారని సెహ్వాగ్ తెలిపాడు.
ముఖ్యంగా కోహ్లీ, కుంబ్లేల మధ్య ఎంత ప్రయత్నించినా సఖ్యత కుదరడం లేదని అమితాబ్ తనతో చెప్పాడని, కుంబ్లే కాంట్రాక్టు గడువు కూడా ముగిసిన అనంతరం హెడ్ కోచ్ గా బాధ్యతలను తీసుకోవాలని వారు కోరినట్లు సెహ్వాగ్ పేర్కొన్నారు.
కోహ్లీ కూడా హెడ్ కోచ్‌గా బాధ్యతలను తీసుకోవాలని చెప్పారని, అయితే తాను అంగీకరించలేదని స్పష్టం చేశారు.