Ajinkya Rahane: ఐపీఎల్‌లో రహానే చెత్త రికార్డు..ఓపెనర్‌గా 12వ డకౌట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో అజింక్య రహానే ఫామ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన రహానే, రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన మ్యాచ్‌లో మరోసారి డక్‌గా అవుట్ అయ్యాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం రెండు బంతులు ఎదుర్కొని రహానే వికెట్ కోల్పోయాడు. దీంతో ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అతనికి ఇది వరుసగా రెండో డక్‌గా నమోదు అయింది. అంతకుముందు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై కూడా అతను గోల్డెన్ డక్‌గా అవుట్ అయ్యాడు.
వివరాలు
ఐపీఎల్ రికార్డులివే..
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రహానే ఇప్పటివరకు 12 డక్స్ నమోదు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అత్యధిక డక్స్ సాధించిన బ్యాటర్‌గా అతను నిలిచాడు. ఈ జాబితాలో పార్థీవ్ పటేల్ మాత్రమే 10కి పైగా డక్స్ నమోదు చేసిన మరో ఓపెనర్‌గా ఉన్నాడు. ఇక మరో ఆసక్తికర విషయమేమిటంటే, వరుసగా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో డక్‌గా అవుట్ అయిన రెండో కేకేఆర్ కెప్టెన్‌గా కూడా రహానే నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు గౌతమ్ గంభీర్ పేరిట ఉంది. అతను 2014లో వరుసగా మూడు సార్లు డక్‌గా అవుట్ అయ్యాడు. అదే సీజన్‌లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడం విశేషం.