Rohit Sharma: రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిఫికేషన్
భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టు కోసం మెల్‌బోర్న్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలిపై గాయమైంది. ఈ గాయం త్రోడౌన్ స్పెషలిస్ట్ దయా వేసిన బంతి కారణంగా సంభవించింది. నొప్పితో విలవిలాడిన రోహిత్‌కు వెంటనే వైద్య సాయం అందించారు. అయితే గాయం తీవ్రంగా లేదని, అతడు బాక్సింగ్ డే టెస్టులో ఆడే అవకాశం ఉందని, ఈ విషయంపై భారత పేసర్ ఆకాష్ దీప్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
గాయం తీవ్రత తక్కువే
క్రికెట్‌లో గాయాలు సాధారణమని, రోహిత్ శర్మ గాయం పెద్ద సమస్య కాదన్నారు. ప్రస్తుతం రోహిత్ బాగానే ఉన్నాడని, అతడు మెల్‌బోర్న్ టెస్టులో పాల్గొంటాడని తెలిపారు. ఇప్పటి వరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆకాష్ దీప్ మొదటి రెండు టెస్టుల్లో తుది జట్టులో చోటు పొందలేకపోయాడు. అయితే మూడో టెస్టులో అతడు, బౌలింగ్‌లో ఓ మోస్తరుగా రాణించగా, బ్యాటింగ్‌లో మాత్రం అద్భుతమైన పోరాటం చేశారు.