LOADING...
Amit Mishra: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన.. దేశవాళీ దిగ్గజం అమిత్ మిశ్రా!
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన.. దేశవాళీ దిగ్గజం అమిత్ మిశ్రా!

Amit Mishra: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన.. దేశవాళీ దిగ్గజం అమిత్ మిశ్రా!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2003లో సౌరబ్ గంగూలీ నేతృత్వంలోని భారత వన్డే జట్టు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అమిత్ మిశ్రా అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీసి 29 పరుగులు ఇచ్చాడు. కానీ, తొలి మ్యాచ్ తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు అమిత్ మిశ్రాని పట్టించుకోలేదు సెలక్టర్లు. టీమ్‌లో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వంటి సీనియర్ స్పిన్నర్లు ఉన్నందున అమిత్ మిశ్రాకు అవకాశాలు దక్కలేదు.

వివరాలు 

మొదటి టెస్ట్‌లో 7 వికెట్లు

అనిల్ కుంబ్లే గాయపడిన తరువాత, 2008లో ఆస్ట్రేలియాతో మొహాలీ టెస్టులో మిశ్రా తన టెస్టు అరంగ్రేటం చేసాడు. ఆ మొదటి టెస్ట్‌లో ఆయన 7 వికెట్లు పడగొట్టారు. తన లెగ్ స్పిన్ నైపుణ్యంతో మైకేల్ క్లార్క్, సిమన్ కటిచ్, షేన్ వాట్సన్ వంటి బ్యాటర్లను అదరగొట్టాడు. ఆ తర్వాత కూడా అమిత్ మిశ్రాకి స్థిరమైన చోటు దక్కలేదు. 2009లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆయన, 2017లో ఇంగ్లాండ్‌తో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ గాయపడడంతో చివరి జట్టులోకి వచ్చిన మిశ్రా, ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీయడమే కాకుండా నైట్ వాచ్‌మెన్‌గా హాఫ్ సెంచరీను కూడా నమోదు చేసాడు.

వివరాలు 

సీనియర్ ప్లేయర్లకు రిప్లేస్‌మెంట్‌

అయినా హర్భజన్ సింగ్ కోలుకోగానే ప్రగ్యాన్ ఓజా, భజ్జీ ఇద్దరినీ ఆడించడం కోసం మిశ్రాని పక్కన కూర్చోబెట్టక తప్పలేదు. తన అంతర్జాతీయ కెరీర్ మొత్తం ఇలా గాయపడిన సీనియర్ ప్లేయర్లను రిప్లేస్‌మెంట్‌గా మాత్రమే జట్టులో చేరడం, బాగా ఆడినా సరే... స్థిరమైన స్థానాన్ని పొందకపోవడం,అమిత్ మిశ్రా కెరీర్ అసాంతంగా సాగడానికి కారణమైంది. మొత్తం 22 టెస్టుల్లో 76 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. 36 వన్డేల్లో 64 వికెట్లు తీసి, 10 టీ20ల్లో 16 వికెట్లు తీశాడు.

వివరాలు 

ఐపీఎల్ 2025లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో మిశ్రా 

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 152 మ్యాచ్‌లు ఆడిన మిశ్రా 535 వికెట్లు తీశాడు. అలాగే, ఒక అజేయ డబుల్ సెంచరీ, 17 హాఫ్ సెంచరీలతో మొత్తం 4176 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 162 మ్యాచ్‌లు ఆడి 174 వికెట్లు తీశాడు. డెలీ డేర్‌డెవిల్స్ (డెలీ క్యాపిటల్స్), డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లకు సేవలు అందించాడు. 2025 లో, అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో ఆయన పేరు ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమిత్ మిశ్ర చేసిన ట్వీట్