Champions Trophy: పాకిస్థాన్‌లో ఊహించని ఘటన.. స్టేడియంలో మారుమోగిన 'జనగణమన'!
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు అపశృతి చోటుచేసుకుంది.
పొరపాటున ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులుగా భారత జాతీయ గీతం "జనగణమన" కొన్ని సెకన్లపాటు ప్లే చేశారు.
ఇదంతా ఊహించని పరిణామంగా మారడంతో, ఆసీస్ ఆటగాళ్లు సహా స్టేడియంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
Details
పోరపాటును గమనించిన స్టేడియం నిర్వాహకులు
ఈ పొరపాటును గమనించిన గడాఫీ స్టేడియం నిర్వాహకులు వెంటనే స్పందించి భారత జాతీయ గీతాన్ని ఆపివేసి, ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని ప్లే చేశారు.
ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోన్న విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా టీమ్ ఇండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు భారత్ నిరాకరించింది.
దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని దుబాయ్‌లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.