తానాసి కొక్కినకిస్‌పై ఆండీ ముర్రే అద్భుత విజయం
మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ఆండీ ముర్రే ఆస్ట్రేలియా ఓపెన్లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో థానాసి కొక్కినాకిస్‌ను మట్టికరిపించాడు. 5గంటల 45 నిమిషాల తర్వాత 4-6, 6-7(4), 7-6(5), 6-3, 7-5 తేడాతో ముర్రే సంచలన విజయాన్ని నమోదు చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లో ముర్రే మాటియో బెరెట్టినిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముర్రే మొత్తం 196 పాయింట్లు సాధించగా, కొక్కినాకిస్ 102 పాయింట్లు చేశాడు. ముర్రే తన మొదటి, రెండవ సర్వీస్‌లో వరుసగా 72, 52 శాతం విజయాన్ని నమోదు చేశాడు. అత్యంత వేగవంతమైన సర్వీస్ (207 KPH)ను ముర్రే ఛేదించడం విశేషం
50 విజయాలను నమోదు చేసిన ఆటగాడిగా ముర్రే రికార్డు
ముర్రే ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 50 విజయాలను పూర్తి చేసిన ఐదోవ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌లో 51-14తో గెలుపు-ఓటమి రికార్డును కలిగి ఉన్నాడు. ముర్రే 2017 తర్వాత తొలిసారిగా మెల్‌బోర్న్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ముఖ్యంగా ముర్రే ఐదుసార్లు (2010-11, 2013, 2015-16) ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ముర్రే చివరిసారిగా 2005లో (వింబుల్డన్‌లో డేవిడ్ నల్బాండియన్‌పై) ఓడిపోయాడు.