Page Loader
IND vs ENG: గంభీర్ తీరుపై ఆగ్రహం.. రాహుల్‌ను తక్కువగా చూసే అవసరం ఉందా?
గంభీర్ తీరుపై ఆగ్రహం.. రాహుల్‌ను తక్కువగా చూసే అవసరం ఉందా?

IND vs ENG: గంభీర్ తీరుపై ఆగ్రహం.. రాహుల్‌ను తక్కువగా చూసే అవసరం ఉందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ను టీ20ల్లో ఓడించిన భారత జట్టు, వన్డే సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. విజయ పరంపర కొనసాగుతున్నా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమైంది. అతడిని బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందికి పంపడంపై పలువురు మాజీ క్రికెటర్లు కోచ్ గౌతమ్ గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రిషభ్ పంత్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపైనా, కేఎల్ రాహుల్‌ను తక్కువ బ్యాటింగ్ ఆర్డర్‌లో పంపడంపైనా క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Details

ఫాయ్ లో శ్రేయస్ అయ్యర్

'శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉండడం టీమిండియాకు గొప్ప విషయమన్నారు. అయితే కేఎల్ రాహుల్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని, అతడి రికార్డులను పరిశీలిస్తే, నంబర్ 5లో అత్యుత్తమ ప్రదర్శన చూపారన్నారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని 6 లేదా 7వ స్థానంలో పంపుతోందన్నారు. అలా అయితే అతడి ప్రదర్శన ప్రభావితమవుతుందని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషించారు. గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేస్తూ, కేఎల్ రాహుల్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Details

మూడో వన్డేలో రిషబ్ పంత్ ను ఆడించాలి

గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావని, ఒక ప్రత్యేక సందర్భంలో అక్షర్‌ను నంబర్ 5లో పంపొచ్చని, కానీ అది స్థిరమైన వ్యూహంగా మారకూడదన్నారు. ఇలాంటి మార్పులు కీలక మ్యాచ్‌లలో సమస్యగా మారే అవకాశం ఉందన్నారు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌ను సమర్థించుకోవడం సరి కాదని, టాప్ 4లో ఇలాంటి మార్పులు చేయకుండా, నంబర్ 5 విషయంలో మాత్రమే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక రిషభ్ పంత్‌ను బెంచ్‌కు పరిమితం చేయడం కూడా సరైన నిర్ణయం కాదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.