యాషెస్ సిరీస్‌లో సెగలు పుట్టిస్తున్న మరో వివాదం.. బెయిర్ స్టో స్టంపౌట్ పై రచ్చ
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో టెస్టు మ్యాచును గెలిచింది. స్వదేశంలో బజ్‌బాల్ స్టైల్ నమ్ముకొని ఆస్ట్రేలియాను భయపెడదామనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగడం లేదు.
రెండు టెస్టులోనూ 43 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించింది.
అయితే ఈ మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఔటైన విధానం మళ్లీ వివాదానికి కారణమైంది.
అతన్ని ఔట్ చేసిన తీరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న వాదనలు వినిపించాయి. గ్రీన్ వేసిన 52 ఓవర్ చివరి బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్ స్టో తర్వాత సహచరుడు స్టోక్స్ తో మాట్లాడేందుకు ముందుకెళ్లాడు.
Details
ఔట్ గా ప్రకటించిన థర్డ్ అంపైర్
ఆ సమయంలో బంతిని అందుకున్న కీపర్ గ్యారీ అండర్ ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్ ను తాకింది.
దీనిపై ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ ను సంప్రదించాడు. ఆ సమయంలో అతను క్రీజుకు చాలా దూరం ఉండటంతో థర్డ్ అంపైర్ దాన్ని ఔట్ గా ప్రకటించారు.
స్టోక్స్ ఆసీస్ ఆటగాళ్లతో మాట్లాడినా ఆ జట్టు తమ అప్పీల్ ను వెనక్కి తీసుకోకపోవడంతో బెయిర్ స్టో పెవిలియానికి చేరాడు.
20.1.1.1 ప్రకారం ఓ బాల్ వికెట్ కీపర్ లేదా బౌలర్ చేతుల్లోనే ఉండిపోతే డెడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కేరీ మాత్రం బంతికి అందుకున్న వెంటనే విసిరేశాడు. దీంతో అది డెడ్ బాల్ కాదు.