World Cup 2023 : ఇంగ్లండ్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు మరో షాక్
ధర్మశాలలో మంగళవారం ఇంగ్లండ్ చేతిలో బంగ్లాదేశ్(Bangladesh) ఓటమిపాలైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 364 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య చేధనలో బంగ్లా 48.2 ఓవర్లలో 227 పరుగులు చేసి ఆలౌటైంది. ఓటమి బాధలో ఆ జట్టుకు మరో షాక్ తగిలింగి. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యేసరికి బంగ్లా తమకోటా ఓవర్ వెనుకబడి ఉండటంతో ఐసీసీ జరిమానా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం బంగ్లాదేశ్ ఆటగాళ్లు అందరికీ ఈ ఫైన్ వర్తించనుంది.
137 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఎహసాన్ రజా, పాల్ విల్సన్, థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్, ఫోర్త్ అంపైర్ కుమార ధర్మసేన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఛార్జ్ తీసుకున్నారు. ఐసీసీ విధించిన ఈ జరిమానాను బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అంగీకరించాడు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాపై డేవిడ్ మలన్ 140 పరుగులు, జో రూట్ 80 పరుగులతో విజృభించడంతో ఇంగ్లండ్ 137 పరుగులతో విజయం సాధించింది. రీస్ టాప్లే (10-1-43-4) బంగ్లా పతనాన్ని శాసించగా.. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్(76) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.