Aronyak Ghosh: ఇండియా 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్
ఈ వార్తాకథనం ఏంటి
బెంగాల్‌కు చెందిన యువ చెస్ క్రీడాకారుడు అరోణ్యక్ ఘోష్ రెండు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) బిరుదును సాధించాడు. బ్యాంకాక్ చెస్ క్లబ్ ఓపెన్ పోటీలో పాల్గొన్న 22 ఏళ్ల కోల్‌కతా ఆటగాడు, జీఎం హోదా కోసం అవసరమైన మూడవ నార్మ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. మొత్తం తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి అరోణ్యక్ ఏడు పాయింట్లు సాధించి, ఇతరులతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు.
వివరాలు
జాతీయ చాంపియన్‌గా నిలిచిన అరోణ్యక్..
2023లో జరిగిన సాంట్స్ ఓపెన్ పోటీలో అతను తన తొలి జీఎం నార్మ్‌ను సంపాదించగా, 2024లో నిర్వహించిన అనెమాస్ మాస్టర్స్ టోర్నీలో రెండో నార్మ్‌ను దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్‌లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన అరోణ్యక్, గత సంవత్సరం ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే అర్హతను కూడా సాధించాడు. ఆ టోర్నీలో మొదటి రౌండ్‌లో పోలాండ్‌కు చెందిన మటెసుజ్ బార్టెల్‌పై విజయం సాధించిన అతను, రెండో రౌండ్‌లో అమెరికా ఆటగాడు లెవోన్ అరోనియన్ చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అరోణ్యక్ 401వ స్థానంలో కొనసాగుతూ, అతని ఎలో రేటింగ్ 2533 పాయింట్లుగా ఉంది.