Page Loader
యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం
యాషెస్ సిరీస్ కు దూరమైన ఒల్లీ పోప్

యాషెస్ సిరీస్ : ఇంగ్లాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2023
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు ముందు గాయం కారణంగా ఆ జట్టు వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ యాషెస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు. రెండో టెస్టు మ్యాచులో గాయం కారణంగా పోప్ గాయపడ్డారని, అతని భుజానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. గాయపడిన ఒలీ పోప్ భుజాన్ని స్కాన్ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆదేశించారట. అందుకే ఈ సిరీస్ నుంచి పోప్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో ఒల్లీ పోప్ ప్రదర్శన అశించన స్థాయిలో లేకపోవడం గమనార్హం.

Details

యాషెస్ సిరీస్‌లో 0-2తో ఇంగ్లండ్ వెనుకంజ

యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులను ఓడిపోయిన ఆతిథ్య ఇంగ్లండ్ సిరీస్‌లో నిలవాలంటే తర్వాతి మ్యాచుల్లో తప్పక నెగ్గాల్సి ఉంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 0-2 తో వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రధానమంత్రుల సైతం పరస్పర విమర్శలకు తమ జట్లకు అండగా నిలబడ్డారు. ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్కాట్ అయితే ఆసీస్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం.