Page Loader
Ashes Series : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఒక్క మార్పుతో బరిలోకి!
బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Ashes Series : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఒక్క మార్పుతో బరిలోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2023
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ చివరి టెస్టు కెన్నింగ్ టన్ ఓవల్‌లో జరుగుతోంది. ఈ సిరీస్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచులో ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ స్థానంలో టాడ్ మర్పీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం సాధించి టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలని ఆసీస్ చూస్తోంది

Details

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లు

మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో వరుణుడు అంతరాయం కలిగించాడు. గెలిచి తీరాల్సిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ డ్రా‌తో సరిపెట్టుకుంది. దీంతో చివరి టెస్టు ఆతిథ్య జట్టుకు చావోరేవో కానుంది. ఆస్ట్రేలియా జట్టు : డేవిడ్ వార్న‌ర్, ఉస్మాన్ ఖ‌వాజా, మార్న‌స్ ల‌బూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌, అలెక్స్ క్యారీ(వికెట్ కీప‌ర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ క‌మిన్స్‌(కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, టాడ్ మ‌ర్ఫీ. ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డ‌కెట్, మోయిన్ అలీ, జో రూట్, బెన్ స్టోక్స్‌(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీప‌ర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌, స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండ‌ర్స‌న్.