LOADING...
Ind vs Ban: సెంచరీతో అదరగొట్టిన అశ్విన్.. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 339/6
సెంచరీతో అదరగొట్టిన అశ్విన్.. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 339/6

Ind vs Ban: సెంచరీతో అదరగొట్టిన అశ్విన్.. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 339/6

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2024
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అద్భుతమైన శతకంతో (102 పరుగులు) ఆకట్టుకున్నాడు. అతడు 108 బంతుల్లోనే సెంచరీని సాధించాడు, అందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ శతకం ద్వారా అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 6వ శతకాన్ని పూర్తిచేశాడు. ఇక జడేజా (86 పరుగులు; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 339-6 (80 ఓవర్లు) వద్ద పటిష్ఠ స్థితిలో నిలిచింది. క్రీజులో అశ్విన్, జడేజా ఉన్నారు.

వివరాలు 

ఆదుకున్న అశ్విన్, జడ్డూ 

144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను జడేజా, అశ్విన్ ఆదుకున్నారు. స్కోర్ 200 అయినా దాటుతుందా అన్న దశలో నుంచి భారత్​కు 300+ స్కోర్ అందించారు. వీరిద్దరూ 7వ వికెట్​కు 195 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పి భారత్​కు భారీ స్కోర్ అందించారు. రోహిత్, గిల్, విరాట్ లాంటి స్టార్లు ఈ పిచ్​పై పరగులు చేయడానికి కష్టపడితే ఈ ఆల్​రౌండర్లు భారీ స్కోర్లతో బంగ్లా బౌలర్లకు ఎదురు నిలిచారు. ఎలాంటి ప్రయోగాత్మక షాట్లకు పోకుండా నిలకడగా ఆడారు. ఈ క్రమంలోనే అశ్విన్ శతకం పూర్తి చేశాడు. కాగా, తన హోం గ్రౌండ్ చెపాక్​లో అశ్విన్​కు ఇది రెండో టెస్టు సెంచరీ.

వివరాలు 

టాప్ ఆర్డర్ విఫలం 

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (6) నిరాశపరిచారు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (0) డకౌట్ అయ్యాడు. వీరిని 24 ఏళ్ల పేసర్ మహ్మద్ హసన్ ఔట్ చేశాడు, దాంతో భారత్ 34 పరుగులకే టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (56 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ (39 పరుగులు)తో కలిసి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇక కే ఎల్ రాహుల్ (16 పరుగులు) కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మహ్మద్ హసన్ 4 వికెట్లు, నహీద్ రానా, మెహెదీ హసన్ మిరాజ్ తలో వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అశ్విన్ సెంచరీ.. బీసీసీఐ ట్వీట్