Page Loader
Asia Cup 2023:బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం  
బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం

Asia Cup 2023:బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2023
11:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఆసియా కప్‌ 2023లో భాగంగా పల్లెకెలెలో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బాంగ్లాదేశ్ 164 పరుగులకే చాప చుట్టేసింది.బాంగ్లాదేశ్ బ్యాట్సమెన్ లలో శాంటో(89)ఒక్కడే అత్యధిక పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్ పతిరణ 4, తీక్షణ 2,వెల్లలాగే,శనక,ధనంజయ చెరో వికెట్ తీశారు.165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 39 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించింది. శ్రీలంక ఓపెనర్ల వికెట్లు త్వరగానే కోల్పోయినా.. సమర విక్రమ (54), అసలంక (62) రాణించడంతో శ్రీలంక విజయాన్ని కైవసం చేసుకుంది. బంగ్లా బౌలర్‌లో షకీబ్ 2, తస్కిన్, షోరిఫుల్, మహెదీ హసన్ చెరో వికెట్ తీశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం