Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ సమయంలో పాకిస్థాన్ నిరసన.. ఐసీసీ చర్యలు?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు అనేక నిబంధనలు అతిక్రమించిందని ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయం పై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపి,పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు అధికారికంగా ఒక ఈమెయిల్ పంపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలన్న పాకిస్థాన్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించడంతో, నిరసనగా పాకిస్థాన్ యూఏఈతో జరిగిన మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వివరాలు
అలాంటి చర్చలకు మీడియా మేనేజర్ హాజరుకావడానికి అనుమతి లేదు
ఇక మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్, పాకిస్థాన్ కోచ్ హెసన్, కెప్టెన్ సల్మాన్ అఘా మధ్య జరిగిన సమావేశాన్ని ఆ జట్టు మేనేజర్ వీడియో తీసిన ఘటనపై కూడా ఐసీసీ సీరియస్ అయింది. అలాంటి చర్చలకు మీడియా మేనేజర్ హాజరుకావడానికి లేదా రికార్డు చేయడానికి అనుమతి ఉండదని స్పష్టంచేసింది. అదే సమయంలో, పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పాడని పీసీబీ ప్రకటించడాన్ని కూడా ఐసీసీ తప్పుబట్టింది.