
SL vs AFG : సూపర్-4 రేసులో ఉత్కంఠ.. శ్రీలంక,అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్..
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో గ్రూప్-ఏ పోరాటం పూర్తయింది.ఈ గ్రూప్ నుంచి భారత్,పాకిస్థాన్ జట్లు సూపర్-4 దశకు అర్హత సాధించాయి. మరోవైపు ఒమన్,యూఏఈ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే, గ్రూప్-బి విషయంలో మాత్రం సూపర్-4కి చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు (గురువారం) ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరు (SL vs AFG) ఫలితం ఆధారంగా గ్రూప్-బి నుంచి సూపర్-4 దశలో అడుగు పెట్టే జట్లు ఏవో ఖరారవుతాయి. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్‌కాంగ్ జట్లు ఉన్నాయి.ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన హాంగ్‌కాంగ్ జట్టు రేసు నుంచి తప్పుకుంది.
వివరాలు
అఫ్గాన్, లంక మ్యాచ్ ఎందుకు కీలకం అంటే..?
శ్రీలంక ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ గెలుపొందింది. దీంతో 4 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో రెండు విజయాలు సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అదే విధంగా అఫ్గాన్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడగా ఓ మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. అబుదాబి వేదికగా జరగనున్న అఫ్గాన్-శ్రీలంక పోరు గ్రూప్-బి సమీకరణాలను పూర్తిగా మార్చగలదు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే, మొత్తం 6 పాయింట్లతో సూపర్-4 దశకు సులువుగా ప్రవేశిస్తుంది. ఈ సందర్భంలో బంగ్లాదేశ్ కూడా సూపర్-4లో చోటు సంపాదిస్తుంది.
వివరాలు
అఫ్గాన్, లంక మ్యాచ్ ఎందుకు కీలకం అంటే..?
కానీ ఒకవేళ అఫ్గానిస్తాన్ విజయం సాధిస్తే,పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఆ సందర్భంలో మూడు జట్లూ (శ్రీలంక,బంగ్లాదేశ్,అఫ్గానిస్తాన్) నాలుగు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేటు కలిగిన రెండు జట్లకే సూపర్-4లో అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంక నెట్ రన్‌రేటు +1.546గా ఉంది.బంగ్లాదేశ్ నెట్ రన్‌రేటు -0.270 కాగా,అఫ్గానిస్తాన్ నెట్ రన్‌రేటు +2.150తో అత్యుత్తమ స్థితిలో ఉంది. కాబట్టి అఫ్గానిస్తాన్ శ్రీలంకపై గెలిస్తే,తన రన్‌రేటుతో ముందంజ వేస్తుంది. లంక కూడా భారీ తేడాతో ఓడిపోకపోతే, ఆ జట్టుకూ తదుపరి దశలో ప్రవేశం దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో,బంగ్లాదేశ్ అభిమానులు మాత్రం శ్రీలంక గెలవాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కీలక మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలని బంగ్లాదేశ్ అభిమానులు కోరుకుంటున్నారు.